FbTelugu

12ఏళ్లు పైబడిన వారికి ఫైజర్ సురక్షితం

న్యూఢిల్లీ: తమ వ్యాక్సిన్ ను 12 సంవత్సరాలు పైబడిన వారికి వినియోగించవచ్చని ఫైజర్ కంపెనీ ప్రకటించింది. భారతీయులపై జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది.
భారత్ లో సెకండ్ వేవ్ కారణమైన వైరస్ ను ఫైజర్ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. బి.1.617.2 వేరియంట్ కు వ్యతిరేకంగా 87.9 శాతం పనిచేసిందని గుర్తు చేశారు. యుకె లో నిర్వహించిన అధ్యయనంలో 26శాతం మంది ఎన్ఆర్ఐలు, ఆసియాకు చెందిన పౌరులపై ట్రయల్స్ నిర్వహించామని ఫైజర్ పేర్కొంది.

ఇక్కడ కూడా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపింది. భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా ఎప్పుడో దరఖాస్తు చేశామని, ఇవ్వకుండా తిరస్కరించారన్నారు. పలు రాష్ట్రాలు సరఫరా చేయాలని తమను కోరుతున్నాయని, అయితే దేశ నిబంధనలు రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేసేందుకు అడ్డంకిగా ఉన్నాయని చెప్పింది. వ్యాక్సిన్ ను రెండు నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నెల రోజుల వరకు భద్రపరుచుకోవచ్చని, ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్ వరకు ఐదు కోట్ల డోసులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఫైజర్ స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.