FbTelugu

ఆర్టీసీ మెడకు పీఎఫ్ ఉచ్చు…

PF-trap-for-RTC-neck

హైదరాబాద్: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో. టీఎస్ ఆర్టీసీకి ప్రావిడెంట్ ఫండ్ అధికారులు నోటీసులు పంపించారు. కార్మికుల పిఎఫ్ ఖాతాలో రూ.760 కోట్లు జమ చేయాల్సి ఉండగా ఇంతవరకు చేయలేదంటూ పీఎఫ్ రీజినల్ కమిషనర్ ఆర్టీసీ ఎం.డి కి పంపిన నోటీసు లో తెలిపారు. ఈ నోటీసుపై ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి సమాచారంతో తమ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో కోరారు. ప్రావిడెంట్ ఫండ్ ఎప్పటికప్పుడు చెల్లించని పక్షంలో భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె, మరోవైపు కోర్టు అక్షింతల కారణంగా ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారుల తల బొప్పి కట్టింది. ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తున్నామనే తెలియని స్థితిలో ఉన్న సమయంలో పిఎఫ్ సమస్య రావడంతో ఉన్నతాధికారులు మరింత హైరానా పడే అవకాశం ఉంది. తమ వద్ద కార్మికుల జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవని హైకోర్టుకు కూడా తెలియచేశారు.

You might also like