FbTelugu

వినియోగదారులపై పెట్రో బాంబు!

న్యూఢిల్లీ: వరుసగా ఎనిమిదవ రోజూ చమురు ధరలు పెరిగాయి. దీంతో దేశంలో పెట్రోల్ ధరలు కనీ వినీ ఎరుగని రీతిలో పెరిపోతూ.. వినయోగదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.  కరోనా నేపథ్యంలో కొద్ది రోజుల వరకూ పాతాళానికి ముడి చమురు ధరలు పడిపోయిన విషయం తెలిసిందే కాగా గత వారం రోజులుగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి.

ఇవాళ పెట్రోల్ పై 0.62 పైసలు పెరిగింది. డీజిల్ పై 0.64 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.75.78 కి చేరింది. డీజిల్ ధర రూ.74.03 కి చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.78.67 కు చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.