న్యూఢిల్లీ: దేశంలో వాహనదారులపై పెట్రోల్, డీజిల్ ధరలు గుదిబండగా మారాయి. వరుసగా 21వ రోజు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు 25 పైసలు, డీజిల్ పై లీటరుకు 21 పైసలు పెరిగింది.
గడిచిన 20 రోజుల్లో పెట్రోల్ పై రూ.9.18 పెరగగా.. డీజిల్ పై రూ.10.27 పెరిగింది. లాక్ డౌన్ లో ప్రపంచ వ్యాప్తంగా.. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు 120 డాలర్ల నుంచి 60 డాలర్లకు పడిపోయినప్పటికీ దేశంలో ప్రభుత్వం ఆయిల్ పై సుంకాలు పెంచేసి పెట్రో ధరలు ఏమాత్రం తగ్గకుండా చేసి వినియోగదారుల నడ్డి విరిచింది.