FbTelugu

మళ్లీ రెండో రోజు పెట్రోల్ ధరల మంట

న్యూఢిల్లీ: ఇక ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నిల కారణంగా మొన్నటి వరకు ధరలు పెంచలేదు.

గడచిన రెండు రోజులుగా మళ్లీ పెంచుతున్నారు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, డిజిల్ పై 1 పైసలు పెంచారు. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.90.55, డిజిల్ ధర రూ.80.91కి చేరుకున్నది. ముంబైలో పెట్రోల్ రూ.97.12, డిజిల్ రూ.88.19, చెన్నై పెట్రోల్ రూ.92.20, డిజిల్ రూ.86.09, కొలకతా పెట్రోల్ రూ.90.92, డిజిల్ రూ.83.98, హైదరాబాద్ లో పెట్రోల్ రూ.94.34, డిజిల్ రూ.88.46, విజయవాడలో పెట్రోల్ రూ.96.49, డిజిల్ రూ.90.11 పలుకుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.