FbTelugu

హైదరాబాద్ లో సెంచరీ కొట్టింది

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల క్రితం లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటగా హైదరాబాద్ లో తాజాగా రూ.100 దాటింది. లీటర్ పెట్రోల్ ధర రూ.100.20 కాగా డీజిల్ లీటర్ రూ.95.14 కు చేరుకున్నది.
తెలంగాణలో ఐదారు జిల్లాలు మినహా అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటడం విశేషం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడం ప్రారంభించాయి.

ఎన్నికల కారణంగా రెండు వారాలు విరామం ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వంతో తమకు సంబంధం లేదని, క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా పెంచుతామని పెట్రోలియం కంపెనీలు చెబుతున్నప్పటికీ కేంద్రం చెప్పినట్లే పెంచుతున్నాయి. గత నలభై రోజులుగా ధరలను పెంచుతూ పోతున్నారు. రాజస్థాన్ శ్రీ గంగానగర్ లో లీటర్ పెట్రోల్ రూ.107, డీజిల్ రూ.100 కు చేరుకున్నది. కరోనా సమయంలో బిజెపి ప్రభుత్వం ధరలు పెంచడంపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు భగ్గుమంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.