FbTelugu

ఐదు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటింది

న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని గగ్గోలు పెట్టిన జనం గత నాలుగైదు రోజులుగా వంద రూపాయలు దాటడం చూస్తున్నారు.

ఆదివారం నాడు ఐదు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఏపి, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు లఢక్ లో లీటర్ పెట్రోల్ సెంచరీ కొట్టింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95 దాటగా, డీజిల్ ధర రూ.86 దాటింది. కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో ఇక్కడ ఇంధన ధరలు తక్కువగా ఉంటాయి. కరోనా సమయంలో ధరలు పెరుగుతున్నాయని జనం లోలోన ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా ప్రభావం చూపాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటూ, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు నడ్డివిరిచేలా ఇంధన ధరలు పెంచడాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేక ప్రాంతీయ పార్టీలకు పట్టం కట్టారు. బిజెపి ఓటమికి ఇదో కారణంగా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.