FbTelugu

రూ.100 దాటిన పెట్రోల్ ధర

న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు తగ్గుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గించకుండా పెంచుకుంటూ పోతున్నది. దేశంలో ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 101.80 కు చేరుకున్నది.
భారత దేశ చరిత్రలో పెట్రోల్ ధరలు రికార్డు బ్రేక్ చేశాయి.

రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో ఇవాళ 38 పైసల పెంపుతో ప్రీమియం పెట్రోల్ లీటర్ కు రూ.101.80 అయ్యింది. రాజస్థాన్ అంతగా పెట్రోల్ రూ.93కు పైన, డీజిల్ రూ.85 కు పైనే ఉన్నాయి. ఢిల్లీలో సాధారణ పెట్రోల్ ధర రూ.86.30, డీజిల్ ధర రూ.76.48 గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ.89.77, డీజిల్ రూ.83.46 చొప్పున పలుకుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో వ్యాట్ 20 శాతానికి తక్కువ కాకుండా 38 శాతం వరకు విధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించకపోవడం మూలంగా ధరలు మండుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.