FbTelugu

ఒక్క రూపాయికే పెట్రోల్… పోటెత్తిన వాహనదారులు!

ముంబయి: పెట్రోల్ ధరలపై సామాన్యుల స్పందన తెలుసుకునేందుకు ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ విక్రయించారు. ఈ వార్త తెలుసుకున్న వాహనదారులు కిలోమీటర్ల కొద్ది క్యూ కట్టారు. అన్ని వర్గాల వారు క్యూ కట్టడంతో బంక్ యజమాని కంగుతిన్నాడు.

ఈ ఘటన మన పొరుగున ఉన్న మహారాష్ట్ర లో చోటుచేసుకున్నది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు, మంత్రి ఆదిత్య థాకరే పుట్టిన రోజు సందర్భంగా డోంబివాలీ యువసేన థానేలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదిత్య థాకరే జన్మదినం సందర్భంగా రూ.1 కే లీటర్ పెట్రోల్ విక్రయిస్తున్నామని డోంబివాలీ యువసేన ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు బంకు ముందు క్యూ లో నిల్చుకుని పెట్రోల్ పోయించుకున్నారు. ఇక్కడే కాకుండా అంబర్ నాథ్ వింకో నకా నగరంలో కూడా ఒక పెట్రోల్ బంక్ యజమాని రూ.50కే లీటర్ పెట్రోల్ విక్రయించాడు. ఒక వర్గం వారే కాకుండా అన్ని వర్గాలకు చెందినవారు పెట్రోల్ కోసం వచ్చారని బంకు యజమాని తెలిపాడు. పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి, పేద ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారనే దానికి ఈరోజు వచ్చిన వాహనదారులే రుజువు అని బంకు యజమాని తెలిపాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.