FbTelugu

కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ బాదుడు

హైదరాబాద్: గత 18 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు వినియోగదారులపై కొనసాగుతోంది. వరుసగా 19వ రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. నిన్న ఒక్కరోజు పెట్రోల్ ధర పెరగకుండా స్థిరంగా ఉండగా.. డీజిల్ ధరమాత్రం 48 పైసలు పెరిగింది.

ఇవాళ పెట్రోల్ పై 16 పైసలు పెరిగి రూ.79.92 కు చేరగా.. డీజిల్ పై 14 పైసలు పెరిగి రూ.80.02 కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ ధర ఏకంగా 80 రూపాయలు దాటేసి తొలిసారిగ పెట్రోల్ ధరను మించిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇంతలా పెరిగిపోతూ సమాన్యులు విలవిలలాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం తమకు సంబంధం లేని విషయం అన్నట్టుగా చోద్యం చూస్తున్నాయి.

You might also like