FbTelugu

పెట్రో మంటలు… రేపే భారత్ బంద్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కనికరం లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను పెంచుతూ ప్రైవేటు కంపెనీలకు సమానం చేసే పనిలో ఉంది. ప్రభుత్వ కంపెనీల రేట్లు, ప్రైవేటు కంపెనీల రేట్లు ఒకేలా చేసి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉందనే విమర్శలు ఉన్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధరలు లీటర్ కు రూ.100 దాటగా, మరికొన్ని రాష్ట్రాలలో సమీపానికి వచ్చింది. డీజిల్ ధరలు కూడా పరుగులు పెడుతునే ఉన్నాయి. ఇలా పెంచడం వలన ఇబ్బందులు పడుతున్నామని, కరోనా కాలంలో ఇదేం తీరంటూ లారీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శుక్రవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ చేపట్టాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పిలుపునకు కార్మిక సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అదే విధంగా కొత్తగా తీసుకువచ్చిన ఈ వే బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా డీజిల్ ధరలు ఒకే విధంగా ఉండేలా చట్ట సవరణ తీసుకురావాలని కోరుతున్నారు.
రైతుల మాదిరి లారీ యజమానుల సంఘం జాతీయ రహదారుల దిగ్భంధం చేయనున్నారు. ఈ సమ్మెలో 40వేల కార్మిక సంఘాలు, 8 కోట్ల మంది వ్యాపారులు పాల్గొననున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.