FbTelugu

జగన్ ను తప్పించాలని సుప్రీంకోర్టులో పిటీషన్

ఢిల్లీ: న్యాయ వ్యవస్థ పైనే ప్రత్యక్ష దాడికి దిగిన ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి పై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.

సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ ఎన్వీ.రమణ పై ఆరోపణలు చేస్తూ లేఖలు విడుదల చేయడంపై అడ్వకేట్లు ప్రదీప్ కుమార్ యాదవ్, జీఎస్.మణి పిటీషన్ వేశారు. తక్షణమే ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలని పిటీషన్ లో కోరారు. సీఎం జగన్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, 30 క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. సీబీఐ, ఈడీ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి నివేదిక అందచేసిందని పిటీషన్ లో తెలిపారు. మానీల్యాండరింగ్ కేసు నమోదు అయిన వ్యక్తి ఇలా న్యాయ వ్యవస్థపై దాడికి దిగడం సరికాదని పిటీషన్ లో కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.