FbTelugu

ఎక్స్ అఫిషియో ఓట్లపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: తెలంగాణలో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పదవీ రిత్యా ఓటు హక్కు కల్పనను సవాల్ చేస్తూ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1)ని కొట్టివేయాలంటూ తన పిటిషన్ లో అనిల్ కుమార్ కోరారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ.. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 4కి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.