FbTelugu

రమణ దీక్షితులపై హైకోర్టులో పిటీషన్

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవీ విరమణ చేసిన రమణదీక్షితులు ను తిరిగి ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ వేణుగోపాల దీక్షితులు హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. వేణుగోపాల్ వేసిన పిల్ ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, రమణదీక్షితులు కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం హయాంలో రమణ దీక్షితులు పదవీ విరమణ చేశారు. అర్చకులకు పదవీ విరమణ వయస్సు ఉండదని ఆయన అప్పట్లో వాదించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్న అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగాను పునఃనియామకం చేస్తామని హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.