FbTelugu

పెన్షన్లలో కోతపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లలో 25 శాతం కోత విధించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై జరిగిన విచారణలో.. ఏజీ (అడ్వోకేట్ జనరల్) రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్యా కోత విధించామని తెలిపారు.

పెన్షన్ లో కోతలు లేకుండా ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కాగా పెన్షన్ కట్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషన్ తరపు న్యాయవాది అన్నారు. పెన్షన్ పై నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్రానికి ఉందని ఏజీ పేర్కొన్నారు. ప్రభుత్వాలకు ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలపాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 17 కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

You might also like