FbTelugu

జగన్ బెయిల్ రద్దు పై హైకోర్టులో పిటీషన్

న్యూఢిల్లీ: ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ లో కోరారు.
జగన్ ఇప్పటికీ 11 ఛార్జిషీట్లలో ఏ1గా ఉన్నారని, ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునేందుకే హైకోర్టులో పిటిషన్ వేశానని ఎంపి తెలిపారు.

ఈ కేసులో ఆయన నిర్దోషిలా బయటపడాలనే నా ఉద్దేశ్యమని మరోటి కాదన్నారు. వైసిపిని రక్షించుకునే బాధ్యత నాపై ఉందని ఎంపి రఘురామకృష్ణమరాజు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునేందుకు మాజీ ముఖ్యమంత్రులు కుమారి జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ లు తమ స్థానంలో వేరే వారిని సిఎం కూర్చీలో కూర్చోబెట్టారని, అదే విధంగా జగన్ కూడా వేరేవారికి అవకాశం ఇవ్వాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.