FbTelugu

‘పంచాయతి’పై పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అతి త్వరలోనే జరగనున్న పంచాయతి ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో తాజాగా వేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తాజాగా నిర్వహించనున్న ఎన్నికల్లో 2019 నాటి ఓటర్ల జాబితా ఉపయోగిస్తున్నారంటూ విద్యార్థిని అఖిల పిటిషన్ దాఖలు చేసింది.

తన పిటిషన్ లో పాత జాబితా కారణంగా 3.6 లక్షల మంది తమ ఓట్లను వినియోగించుకోలేరని పేర్కొంది. ఈ పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపింది. ఎస్ఈసీ తరఫు న్యాయవాది వాదిస్తూ అసలు పిటిషనర్ ఓటు కోసం దరఖాస్తే చేయలేదని, పిటిషనర్ వాదన అర్థరహితమని తెలపగా పిటిషనర్ తరపు న్యాయవాది పూర్తి వివరాలతో తమ వాదనలు వినిపిస్తామని కోర్టును కోరారు. దీంతో విచారణ రేపటికి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.