FbTelugu

ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ను పాటించని ఎమ్మె్ల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ను ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు.

లాక్ డౌన్ లో ప్రజలు సమూహంగా ఏర్పడడానికి అనుమతి లేదని, ఎవ్వరు లాక్ డౌన్ ఉల్లంఘించినా చట్టవిరుద్దమేనని ప్రభుత్వ తరపు న్యాయవాది అన్నారు. అటువంటి వారిని ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చుకోవచ్చని న్యాయవాది తెలిపారు. పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.