FbTelugu

వైసీపీ వర్గీయుల ఘర్షణలో వ్యక్తి మృతి

చిత్తూరు: ఉపాధి హామీ విషయంలో తలెత్తిన వివాదంతో వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలోని రామకుప్పం మండలం, రామాపురం తండాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఉపాధి హామీ పని విషయంలో తలెత్తిన ఓ వివాదంతో  వైసీపీ లోని ఇరువర్గాలు తీవ్ర ఘర్షణకు పాల్పడ్డాయి. ఈ ఘర్షణలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేష్ నాయక్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురికి తీవ్ర గాయాలైనాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.