FbTelugu

బాబు విశాఖ పర్యటనకు అనుమతి

సోమవారం ఉదయం ఎల్జీ పాలిమర్స్ కు

సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లి

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఏపీ డీజీపీ, చంద్రబాబు విశాఖపట్నం తో పాటు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకునేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు.

బాబు వెంట ఆయన కుమారుడు నారా లోకేష్, శ్రీనివాస్ కు కూడా అనుమతి లభించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆర్ఆర్.వెంకటాపురం చేరుకుని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలను, బాధితులను పరామర్శిస్తారు.

స్థానిక టీడీపీ నాయకులతో సమావేశమై, తిరిగి అదే రోజు సాయంత్రం రోడ్డుమార్గంలో ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. లాక్ డౌన్ అమలు నుంచి చంద్రబాబు హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన తరువాత కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని విశాఖపట్నం వెళ్లివచ్చారు. సుమారు రెండు నెలల తరువాత ఆయన ఉండవల్లి నివాసానికి వెళ్తున్నారు.

You might also like