FbTelugu

మరో వ్యాక్సిన్ కు అనుమతి

న్యూఢిల్లీ: స్వదేశీ నినాదం పేరుతో రెండు వ్యాక్సిన్లకు అనుమతించి, మిగతా వాటిని పట్టించుకోకపోవడంతో భారత ప్రభుత్వం సెకండ్ వేవ్ లో అప్రతిష్టను మూటగట్టుకున్నది. ఈ అనుభవంతో తాజాగా మోడర్నా వ్యాక్సిన్ కు కూడా పచ్చజెండా ఊపింది.
అమెరికాకు చెందిన మోడర్నాకు అత్యవసర వినియోగం కింద అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ అనుమతితో కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి తో పాటు మోడర్నా చేరింది. ఈ వ్యాక్సిన్ కు అనుమతించాలని సిప్లా కంపెనీ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతించింది. 90 శాతం సమర్థత కలిగిన మోడర్నా కెనడా, బ్రిటన్ తో యురోపియన్, అరబ్ ఏమిరేట్స్ దేశాలలో వినియోగిస్తున్నారు. స్పుత్నిక్ కు ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం వాటి టెస్టులపై నివేదిక ఇవ్వకపోవడం మూలంగా నెల రోజుల నుంచి మార్కెట్ లో విడుదల చేయలేకపోతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.