FbTelugu

డ్రైవర్ లేని కార్లకు అనుమతి

బీజింగ్: డ్రైవర్ లేని కార్లపై పలు దేశాల్లో ప్రయోగాలు నడుస్తున్నాయి. అయితే అందరికన్నా ముందుగానే మార్కెట్ లోకి తెచ్చేందుకు చైనా దేశం ఒక అడుగుకు ముందుకు వేసింది.

ఆటో ఎక్స్ కంపెనీ కి చెందిన డ్రైవర్ రహిత కార్లను పరీక్షించేందుకు చైనా ప్రభుత్వం రోడ్ల మీదికి అనుమతించింది. షెంజెన్ రోడ్లపై ఇవి పరుగులు తీయనున్నాయి. ఈ కార్లలో భద్రత కోసం డ్రైవర్ గాని రిమోట్ కంట్రోల్ తో నియంత్రించడం ఉండదు. కారు దానంతట అదే ట్రాఫిక్ లో వెళ్లనున్నది. ట్రాఫిక్ రద్దీ ఎక్కుకవగా ఉండే ప్రాంతాల్లో వీటిని తిప్పనున్నారు.

ఇప్పటి వరకు మనం ప్రయోగ దశలో ఉన్న కార్లనే చూశాం కాని, రోడ్ల మీదకు వచ్చిన కార్లను ఇప్పటి వరకు చూడ్డం చాలా అరుదు. ఇక నుంచి మనం చూడాల్సిందల్లా డ్రైవర్ రహిత కార్లు ఎంత తొందరగా వస్తాయనేది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.