FbTelugu

సినిమా షూటింగ్ లకు అనుమతి

సినిమా హాళ్లకు అనుమతి లేదు

హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు.

రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా/టీవీ కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించిందన్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, పరిమిత సిబ్బందితో షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు గతంలో సీఎం కేసీఆర్ కు హామీ ఇచ్చారు. దీనిని అనుసరించి కేసీఆర్ షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.

You might also like