FbTelugu

350 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు అనుమతి

అమరావతి: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రావడం, కాలుష్యం పెరిగిపోతుండడంతో ఏపి ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహిస్తున్నది. ఇక నుంచి విద్యుత్ తో నడిచే బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

కాలుష్య నియంత్రణ దిశగా ఏపిఎస్ఆర్టిసి ముందడుగు వేసింది. రూ.500 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. రాష్ట్రంలోని 4 మార్గాల్లో ఏపిఎస్ఆర్టిసి తొలిదశలో 350 బస్సులు నడపనున్నది. తిరుమల-తిరుపతి మధ్య 100 బస్సులు, విజయవాడ-గుంటూరు మధ్య 100 బస్సులు,విశాఖపట్నంలో 100 బస్సులు, కాకినాడలో 50 బస్సులు నడిపే యోచన ఉంది. విద్యత్ బస్సులతో కాలుష్యం లేకపోవడంతో పాటు డీజిల్ భారం నుంచి బయటపడనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.