కడప: వైసీపీ ఎంపీ వైఎస్.అవినాష్ రెడ్డి కృషి ఫలించింది. త్వరలో కడప విమానాశ్రయం లో నైట్ ల్యాండింగ్ కు లైన్ క్లియర్ అయ్యింది.
అటవీ శాఖ నుండి అభ్యంతరాలు తొలగడంతో లైట్లు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఢిల్లీలో జరిగిన నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళ విమానాలు దిగేలా పలు మార్లు ఢిల్లీలో అటవీశాఖ అధికారులను కలిసి ఎయిర్ పోర్టు అడ్వైజరి కమిటి చైర్మన్, ఎంపీ అవినాష్ రెడ్డి విన్నవించారు.
నాలుగు అబ్ స్టాకిల్ లైట్ల ఏర్పాటుకు అనుమతించారు. ఇందులో రెండు ప్రాంతాలు కడప ఫారెస్ట్ డివిజన్ లోని లంకమల్ల అభయారణ్యం కాగా… మరో రెండు ప్రొద్దుటూరు సబ్ ఫారెస్ట్ డివిజన్ లోని నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల సంరక్షణ ప్రాంతంలో ఉన్నాయి. వీటి ఏర్పాటుకు అనుమతి ఇస్తూ వైల్డ్ లైఫ్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.