FbTelugu

తిరుమలలో నేటినుంచి సామాన్య భక్తులకు అనుమతి

తిరుమల తిరుపతి దేవస్థానంలో నేటి నుంచి సమాన్య భక్తులను అనుమతించనున్నారు. లాక్ డౌన్ కారణంగా 82 రోజుల పాటూ దర్శనాలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే. నిన్న స్థానికులకు, మొన్న టీటీడీ ఉద్యోగులు ట్రయల్ దర్శనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పలు విషయాలు వెల్లడించారు. ప్రతిరోజూ 6వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

కంటైన్మెంట్ జోన్లలో ఉన్న భక్తులు రావద్దని టీటీడీ సూచించింది. 65 ఏండ్ల పైబడిన వారు, 10 ఏండ్ల లోపు చిన్నారులకు అనుమతి లేదని తెలిపారు. అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. అనుమానితులను క్వారంటైన్ కు పంపనున్నట్టు తెలిపారు. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు సామాన్య భక్తులను అనుమతించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ నెల 14 వరకు టికెట్లను టీటీడీ జారీ చేసింది.

You might also like