FbTelugu

తిరుమలకు బస్సులు, దుకాణాల అనుమతి

తిరుపతి: శ్రీవారి  దర్శనానికి భక్తులను ఈనెల 11వ తేదీ నుంచి అనుమతిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ సమాయత్తమైంది.

6వ తేదీ (రేపటి నుంచి) తిరుమలకు ఆర్టీసీ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపించనున్నారు. టిటిడి ఉద్యోగులను సిబ్బందిని తిరుమలకు తరలించేందుకు 50 బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. 8, 9 తేదీల్లో శ్రీవారి దర్శనం ప్రయోగాత్మకంగా చేపడుతున్నందున సిబ్బంది, ఉద్యోగులను తిరుమలకు అనుమతించనున్నారు.

అదే విధంగా తిరుమల కొండపై దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతించారు. ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే విక్రయాలు చేసుకోవాలి. ఒక్కో దుకాణంలో ఇద్దరు యజమానులు కూర్చునేందుకే అనుమతించారు. దుకాణాల వద్ద భక్తులు ఆరడుగుల భౌతికదూరం (ఫిజికల్ డిస్టాన్స్) పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రతి దుకాణంలో శానిటైజర్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని టీటీడీ ఆదేశించింది.

You might also like