FbTelugu

మరో వ్యాక్సిన్ కు అనుమతి… తీరనున్న కొరత

న్యూఢిల్లీ: దేశంలో గత వారం రోజులుగా వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. పలు రాష్ట్రాలలో నిల్వలు అడుగంటిపోయాయి. టీకోత్సవ్ కూడా సరిపడి నిల్వలు లేవంటూ పలు రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి.
ఈ తరుణంలో కష్టాల నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యా తయారు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు ఆమోద ముద్ర వేసింది.

దీంతో పాటు మరో నాలుగు వ్యాక్సిన్లకు అనుమతించే పనిలో ఉంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ నిన్ననే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సిఫారసును పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆమోదముద్ర వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపింది.
ఇండియాలో విక్రయించేందుకు, ఉత్పత్తి చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తో రష్యాకు చెందిన ఆర్.డి.ఐ.ఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఒప్పందం తరువాత రెండు, మూడు క్లినికల్ పరీక్షలు కూడా నిర్వహించారు. పరీక్షా ఫలితాల రిపోర్టును డిజిసిఐ కి సమర్పించి అనుమతించాల్సిందిగా గత నెలలో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దరఖాస్తు సమర్పించింది. దరఖాస్తుతో పాటు డేటా వివరాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆమోద ముద్ర వేసింది. మూడో వ్యాక్సిన్ రానుండడంతో రెండు మూడు రోజుల్లో పలు రాష్ట్రాలకు వ్యాక్సిన్లను కార్గొ విమానాల ద్వారా యుద్ద ప్రాతిపదికన తరలించి కొరతను తగ్గించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.