FbTelugu

5జి ప్రయోగాలకు అనుమతి

న్యూఢిల్లీ: దేశంలో 5వ జనరేషన్ టెలికాం ప్రయోగాలకు కేంద్ర టెలికాం మంత్రిత్వం శాఖ అనుమతి ఇచ్చింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, ఎంటిఎన్ఎల్, వోడాఫోన్ లు 5 జి ట్రయల్స్ ప్రారంభించవచ్చని తెలిపింది.

అయితే 5జి ట్రయల్స్ లో చైనా దేశానికి చెందిన సంస్థల టెక్నాలజీని ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దని షరతు విధించింది. టెలికాం కంపెనీలు అన్ని కూడా ఎరిక్ సన్, శాంసంగ్, నోకియా, సి డాట్ అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయం తీసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు ట్రయల్స్ నిర్వహించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.