FbTelugu

పర్మినెంట్ గా వర్క్ ఫ్రం హోమ్: ఫేస్ బుక్

వాషింగ్టన్: కరోనా వైరస్ తో ప్రపంచం తల్లకిందులు అయ్యింది. ఇప్పట్లో కోలుకునేలా పరిస్థితులు లేవు. జీవితాలే తారుమారు అయ్యే దుస్థితికి చేరుకున్నది. పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏడాదికాలంగా వర్క్ ఫ్రం హోమ్ అమలుపరుస్తున్నాయి.

ఇక నుంచి ఫేస్ బుక్ ఉద్యోగులు ఇంటి నుంచే శాశ్వతంగా పని చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఒక దేశంలో పనిచేస్తున్న వారు మరో దేశానికి వెళ్లి పనిచేస్తామంటే అక్కడికి కూడా పంపిస్తామని తెలిపింది. జూన్ 15వ తేదీ నుంచి రిమోట్ గా ఉద్యోగం చేయాలనుకునేవారికి శాశ్వతంగా వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పిస్తామన్నారు. సంవత్సర కాల అనుభవంతో పనిచేసే ప్రదేశం కంటే పనిచేసే విధానమే ముఖ్యమైనదని తమకు అవగతమైంది. ఇందుకు అనుణంగా హైబ్రిడ్ కార్యాలయాలు, రిమోట్ సెటప్ కోసం కంపెనీ ప్రణాళికలను నిర్ధేశిస్తున్నది. ప్రపంచంలో దిగ్గజ సాఫ్ట్ వేర్, సోషల్ మీడియా సంస్థలు ఏడాది కాలంగా వర్క్ ఫ్రం హోమ్ అమలు చేస్తున్నాయి. అయితే అమెరికా సిలికాన్ వ్యాలీలో మాత్రం పలు సంస్థలు తమ క్యాంపస్ లలో 50 శాతం ఉద్యోగులు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.