FbTelugu

రైల్వే స్టేషన్ లో కిలోమీటర్ల మేర జనం క్యూ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వేస్టేషన్లలో ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఇవాళ్టి నుంచి ఢిల్లీ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు ప్యాసింజర్ రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే రైల్వే స్టేషన్లలో ప్రభుత్వ ఏర్పాట్ల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ తొలి ట్రైన్ సాయంత్రం నాలుగుగంటలకు బయలుదేరనున్నట్టు సమాచారం. కానీ ఇప్పటికే ప్రయాణికులు స్టేషన్ నుంచి కిలోమీటర్ల మేర క్యూ కట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.