FbTelugu

ప్రజలు మాస్క్ లు పెట్టుకోవడం లేదు: సీఎం ఉద్ధవ్

ముంబై: ప్రపంచంలో కరోనా వేవ్ రెండోసారి రావడం కాదని కరోనా సునామి వచ్చిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తెలిపారు. వైరస్ ప్రతాపం నుంచి రక్షించుకునేందుకు ప్రజలందరూ సురక్షితంగా ఉండడమే మేలన్నారు.

మహారాష్ట్రలో మరోసారి లాక్ డౌన్ విధించే పరిస్థితులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయని, ఇది రెండు, మూడో వేవ్ కాదని, సునామీ అని ఆయన వివరించారు. ఏ రంగాన్ని కూడా పనిచేయనివ్వడం లేదని, ఉపాధి రంగం దెబ్బతిన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో వ్యాధిని కట్టడి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, బాధితులకు వైద్య సాయం అందిస్తున్నామని ఉద్ధవ్ థాక్రే తెలిపారు.
రాష్ట్రలో ఎనిమిది నెలలుగా పోరాటం చేస్తున్నామని, ఇటువంటి సమయంలో ప్రజలు భౌతిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, శానిటైజర్ వాడానలని ఆయన పిలుపునిచ్చారు. చాలా మంతి మాస్కులు పెట్టుకోవడం లేదని, భౌతిక దూరం పాటించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర పౌరులందరికీ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు చొప్పున ఇవ్వాల్సి ఉందని, 24 కోట్ల డోసులు అవసరమని ఉద్ధవ్ పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.