FbTelugu

వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం: నిమ్మగడ్డ

హైకోర్టు ఆదేశాలతో బాధ్యతల స్వీకరణ

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) గా బాధ్యతలు స్వీకరించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు.

హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం అని అన్నారు. త్వరలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తానని అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విధుల్లో చేరుతున్నానని ఆయన తెలిపారు.

You might also like