FbTelugu

చనిపోయిన శవానికి కూడా పెన్షన్

విజయనగరం: ఏపీలో వాలంటీర్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వం పరువు తీస్తున్నారు. వాళ్లు అనుకున్నదే వేదంగా పనిచేస్తున్నారు. చనిపోయిన వృద్ధురాలి శవం పక్కన కూర్చుని ఫోటో తీసుకోవడమే కాకుండా పెన్షన్ డబ్బులు ఇచ్చేశాడు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. గుర్ల మండలం గుర్ర గ్రామంలో ఇవాళ ఈ ఘటన చోటు చేసుకున్నది.

ఎర్ర నారాయణి అనే మహిళ ఇవాళ చనిపోయింది. సాధారణంగా చనిపోయిన వారికి పెన్షన్ కాని ఎలాంటివి ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. ఇవేమి పట్టించుకోకుండా వాలంటీర్ ఇజ్జిరోతు త్రినాథ్ వృద్ధురాలి వేలి ముద్రలు తీసుకుని ఫించన్ ఇచ్చేశాడు. ఇలా ఇవ్వడాన్ని గ్రామస్థులు తప్పుపట్టారు. జిల్లా డీ.ఆర్.డీ.ఏ పీడీ సుబ్బరావుకు ఫిర్యాదు చేశారు.
చనిపోయిన వారి వేలి ముద్రలు చెల్లవని, అలా ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు. విచారణ చేయాల్సిందిగా గుర్ల ఎంపీడీఓ ను ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.