FbTelugu

ముగ్గురు లేడీ కానిస్టేబుళ్లకు సమానంగా ఫెనాల్టీ

ఖమ్మం: ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు హెల్మెట్ ధరించకుండా, రయ్ రయ్ మంటూ సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్తున్న ఫొటోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోను చూసిన పలువురు ముక్కున వేలేసుకున్నారు. సోషల్ మీడియాలో పోలీసు శాఖ పరువు తీసే విధంగా వ్యాఖ్యానాలు ఉండడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించింది. ఒకే వాహనంపై ముగ్గురు ఎక్కడమే కాకుండా ఎవరికి కూడా హెల్మెట్ లేదు. పైగా వారిలో ఇద్దరు సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. ఇన్ని ఉల్లంఘనలు ఉంటే అధికారులు మాత్రం ఊరుకుంటారా మరి. మొత్తానికి ఆరా తీయగా ఖమ్మం పోలీసులు అని తేలింది. వీరు ఖమ్మం రైల్వే స్టేషన్ రోడ్డులో వెళ్తుండగా ఒకరు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ముగ్గురు కానిస్టేబుళ్లకు ఫెనాల్టీ విధించాలని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు వారియర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరికి రూ.1100 చొప్పున మొత్తం రూ.3300 ఫెనాల్టీ విధించారు. అదే విధంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ముగ్గురు లేడీ కానిస్టేబుళ్లు లబోదిబోమంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.