FbTelugu

ఏపీలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మధు అరెస్టు

పెద్దపల్లి: జిల్లా పరిషత్ ఛైర్మన్, టిఆర్ఎస్ నాయకుడు పుట్ట మధును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అదుపులోకి తీసుకున్నారు.

పుట్ట మధు కొద్ది రోజులుగా కన్పించకుండా వెళ్లిపోవడంతో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎక్కడికి వెళ్లలేదని మధు భార్య పుట్ట శైలజ వివరణ కూడా ఇచ్చారు. కరోనా లక్షణాలు ఉండడంతో బయటకు రావడం లేదని పేర్కొంది. తాము ఈటల రాజేందర్ కు మద్దతు పలకడం లేదని, పార్టీలో సీనియర్ నాయకుడు కావడంతో అప్పట్లో కలిసేవారమన్నారు. తాము టిఆర్ఎస్ లోనే కొనసాగుతామని, తమను ఈ స్థాయికి తీసుకువచ్చింది సిఎం కెసిఆర్ అని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.

వకీలు గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ జరిపారు. ఈ కేసులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.