FbTelugu

ఇద్దరితో కొలువులు భర్తీ అవుతాయా?: ఉత్తమ్

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్, ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ లో ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారని, వారు కూడా మార్చి 11వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారని ఆయన తెలిపారు. ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పిన సీఎం, ఇద్దరితో ఎలా పూర్తి చేస్తారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కారణంగా ఆరు నెలల పాటు సభ్యులను నియమించే పరిస్థితి లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 50వేల ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని ఉత్తమ్ రెడ్డి అన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సీఎం ప్రకటనలు చేశారని, ఆచరణలో సాధ్యం కాదని అన్నారు. నిరుద్యోగ భృతి త్వరలో ఇస్తామని చెప్పిన కేటీఆర్ నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించారని ఉత్తమ్ విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.