FbTelugu

పేటీఎం పై గూగుల్ వేటు

ఢిల్లీ: డిజిటల్ పేమెంట్ గేట్ వే ‘‘పేటీఎం’’ పై గూగుల్ వేటు వేసింది. తన ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించింది. సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘనలు ఉండడం మూలంగానే ఈ చర్య తీసుకున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.

గతంలో ఈ ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేసినా స్పందించలేదని పేర్కొంది. క్యాసినోస్, గ్యాంబ్లింగ్, మనీ ప్రమోషన్లు తమ నిబంధనలకు వ్యతిరేకమని ప్రకటించింది. పేటీఎం మనీ, మాల్, బిజినెస్ యాప్ లు యధావిథిగా ప్లే స్టోర్ లో ఉంటాయని వెల్లడించింది. కాగా దీనిపై పేటీఎం యాజమాన్యం స్పందించింది. త్వరలోనే యాప్ అందుబాటులోకి వస్తుందని, అందరి డబ్బులు సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.