FbTelugu

పొలాల వద్దే రైతు బంధు సొమ్ము చెల్లింపు

హైదరాబాద్: ఏరువాక ప్రారంభం కావడంతో రైతులు ఇళ్ల వద్ద ఉండడం లేదు. పొలాల వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నారు. రైతు బంధు లబ్ధిదారులకు సౌలభ్యంగా ఉండేందుకు పొలాల వద్దకే తపాలా సిబ్బంది వెళ్లి డబ్బులు ఇస్తున్నారు.

ఇంటి వద్దే సేవలందించేందుకు మైక్రో ఏటిఎం లు అందుబాటులోకి వచ్చాయి. ఫించన్లతో సహా పలు పథకాలను వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. వరి నాట్ల బిజీలో ఉన్న రైతుల పొలాల వద్దకు తపాలా సిబ్బంది వెళ్లి, హ్యాండ్ హెల్డ్ మైక్రో ఏటిఎంల ద్వారా బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. అక్కడే డబ్బులు చెల్లించి వస్తున్నారు. రైతు బంధు పథకం కింద ఈ సీజన్ లో ఒక లక్ష మందికి పైగా రైతులకు రూ.66 కోట్ల నగదు చెల్లింపులు చేసినట్లు తపాలా శాఖ అధికారులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.