FbTelugu

అప్పు చెల్లించు… లేదంటే చిప్ప కూడు తప్పదు?

ముంబై: సహారా ఫైనాన్స్ కంపెనీ అధినేత సుబ్రతా రాయ్ కు చెందిన రెండు కంపెనీలు రూ.62,600 కోట్లు చెల్లించాల్సిందిగా ఆదేశించాలంటూ సెబీ సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేసింది. ఆయన కంపెనీలు డబ్బులు చెల్లించని పక్షంలో బెయిల్ ను రద్ధు చేయాల్సిందిగా కోరింది.

ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం సొమ్మును 15 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సిందిగా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2014 లో అరెస్టయిన సుబ్రతా 2016లో జైలు నుంచి విడుదల అయ్యారు. అప్పటి నుంచి బెయిల్ పై బయటే ఉంటున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా నిబంధనలు ఉల్లంఘించిన సుబ్రతా ఇకనైనా పూర్తి సొమ్ము చెల్లించాలని లేదా కస్టడీలోకి తీసుకునే ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం ను సెబీ కోరింది. సహారా ఫైనాన్స్ కంపెనీ అసలు మొత్తంలో కొంత మేర మాత్రమే డిపాజిట్ చేసిందని, మిగిలిన సొమ్ముతో పాటు వడ్డీ కలిపితే రూ.62,600 కోట్లకు చేరిందని సెబి లెక్కలు సమర్పించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.