తిరుమల: జనసేన అధినేత, సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి దర్శనం కోసం తిరుమల చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ సమయంలో కలియుగ దైవాన్ని దర్శించారు.
కరోనా మహమ్మారి కారణంగా ఏడాది కాలంగా దేవుడిని దర్శించుకోలేకపోయానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆలయం వెలపల ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున జనం ముందుకు రావడంతో వ్యక్తిగత భద్రతా సిబ్బంది కారు వద్దకు తీసుకువెళ్లేందుకు శ్రమించారు.