FbTelugu

3న తిరుపతిలో పవన్ పాదయాత్ర

తిరుపతి: ఏప్రిల్ 3న తిరుపతిలో జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ పాదయాత్ర చేయనున్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి కె.రత్నప్రభకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు.

ఎమ్మార్‌పల్లి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ పాదయాత్ర చేసి ఆ తరువాత శంకరంబాడి లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగసభ లో పాల్గొంటారు. ఈ మధ్యకాలంలో పవన్ బిజెపి పట్ల కాస్త గుర్రుగా ఉన్నారు. మొన్న తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతు పలకాలని జనసేన కార్యకర్తలకు పోలింగ్ రోజున ఉదయం పిలుపునిచ్చారు. బిజెపి అభ్యర్థి రామచంద్రరావు కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. పవన్ చర్యతో కంగుతిన్న ఏపీ బిజెపి నాయకులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏపీకి కాబోయే సిఎం పవన్ అంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్ననే ఒక ప్రకటన చేశారు. ఇవాళ బిజెపి ఎంపి జివిఎల్.నరసింహారావు పవన్ ను ఆకాశానికెత్తారు. ఆంధ్రాకు భవిష్యత్తు సిఎం పవన్ అని స్పష్టం చేశారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడంతో బిజెపి నేతలకు పవన్ విలువ తెలిసొచ్చినట్లు ఉంది. తిరుపతిలో కనీసం డిపాజిట్ అయినా దక్కించుకునేందుకు మెప్పు కోసం నానా పాట్లు పడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.