FbTelugu

పవన్ కళ్యాణ్ ‘లాంగ్‌మార్చ్‌’ ప్రారంభం

Pawan-Kalyans-Launches-Longmarch-in-vizag

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరతకు నిరసనగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ ర్యాలీ ప్రారంభం అయింది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన అధినేత ఈ లాంగ్‌మార్చ్‌ చేపట్టారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పవన్‌ లాంగ్‌మార్చ్‌ను ప్రారంభించారు. ఈ లాంగ్‌మార్చ్‌ రామాటాకీస్‌, ఆశీల్‌మెట్ట జంక్షన్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి పలు పార్టీల మద్దతు ప్రకటించాయి. కాగ ర్యాలీలో అభిమానులు, కార్యకర్తల జోరు బాగానే కన్పిస్తోంది.

You might also like