FbTelugu

ఢిల్లీకి పవన్ కళ్యాణ్

హైదరాబాద్: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణలో పార్టీ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చించుకోనున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఇరు పార్టీలు ఎలా పోరాడాలనే దానిపై చర్చించి ఒక రోడ్డు మ్యాప్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన ఓట్లు బీజేపీ అభ్యర్థులకు పడేలా చేయాలని పవన్ ను కోరనున్నారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జీ మురళీధరన్ కూడా పాల్గొననున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.