FbTelugu

పరీక్షలు నిర్వహించకపోవడమే బెటర్: పవన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకపోవడమే బెటరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో కరోనా వ్యాప్తి రోజురోజుకి తీవ్రంగా పెరుగుతోందని అన్నారు.

ప్రభుత్వం డిగ్రీ ఫైనలియర్ విద్యార్థుల విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని అన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.