FbTelugu

టీఆర్ఎస్ కు జైకొట్టిన జనసేన

హైదరాబాద్: జనసేన, బీజేపీ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయా అంటే అవుననే విధంగా పవన్ అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయానికి పనిచేయాల్సిందిగా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

పోలింగ్ రోజే సురభి వాణిదేవికి ఓటు వేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తమ పార్టీని చులకన చేసేలా బీజేపీ మాట్లాడిందన్నారు. బీజేపీ తమను పదే పదే అవమానపరుస్తోందని, అందుకే తాము తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవీకి మద్దతిస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.