FbTelugu

మహేష్ రికార్డు ను బద్దలు కొట్టిన పవన్

హైదరాబాద్: ప్రిన్స్ ఘట్టమనేని మహేష్ బాబు రికార్డును హీరో కొణిదెల పవన్ కళ్యాణ్ అధిగమించారు. పవన్ అభిమానులు వరల్డ్ రికార్డు సృష్టించారు.
రికార్డులు ఉన్నది వేరొకరు బద్దలు కొట్టడానికే అని పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. అన్నట్లుగానే ఆయన అభిమానులు అన్నంత పని చేశారు. ప్రస్తుతం హీరలో మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోటీ నడుస్తోంది. ఇంత సమయంలో ఎంత మంది ట్వీట్ చేశారు, ఎందరు ట్రెండింగ్ లో పాల్గొన్నారనేది అనేది ఇప్పుడు రికార్డులు.

మహేష్ బాబు జన్మదినం సందర్భంగా మొన్న ఆయన అభిమానులు బర్త్ డే ట్యాగ్ ను ఒక రోజు వ్యవధిలో 60.2 మిలియన్లు ట్యాగ్ చేశారు. ఇది రికార్డు గా అభిమానులు ప్రకటించుకున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ జన్మదినం, అది రానే లేదు అప్పుడే ముందస్తు బర్త్ డే పేరుతో మహేష్ రికార్డును అధిగమించారు. పవన్ అభిమానులు బర్త్ డే ట్యాగ్ ను ఒక్క రోజులో 65 మిలియన్లు ట్యాగ్ చేశారు. ఇప్పుడే ఇంత భారీగా ఉంటే ఆరోజు ఎంత రెచ్చిపోతారో చూడాల్సిందే మరి.

You might also like