FbTelugu

కేసీఆర్ కు కేంద్రం మార్గం సుగమం

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకుండా అన్నీ అనుమతులు ఇచ్చేసింది.
ఇప్పటికే తెలంగాణ హైకోర్టు అనుమతించగా, తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా పచ్చజెండా ఊపడంతో అడ్డంకులు తొలగిపోయాయి.

ఎలాంటి వాస్తు దోషం లేకుండా రూ.500 కోట్లతో నూతన సచివాలయం నిర్మాణం చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం ఆరు అంతస్తుల్లో 7 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేయనున్నారు. మంత్రుల ఛాంబర్ పక్కనే సంబంధిత శాఖల కార్యదర్శులు, సెక్షన్లు ఉండనున్నాయి. మొత్తం 27 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్థలంలో సీఎం ప్రవేశానికి ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.