FbTelugu

వెండితెర ఫైటింగ్‌కు విరామం!

అప్ప‌ట్లో అంటే… 1970-80లో తెలుగు సినిమా అంటే వినోదం. ఆ త‌రువాత అభిమానుల నీరాజ‌నాలు. తిరుప‌తి వెళ్లే.. అట్నుంచి అటే మ‌ద్రాసు పోయి.. ఎన్టీఆర్‌ను చూడాల‌నేంతగా తెలుగు నాట నాటుకుపోయింది.

అలా క్ర‌మంగా సినిమా తెర నుంచి రాజ‌కీయాల్లోకి తార‌లు రావ‌టంతో అది పీక్‌కు వెళ్లింది. ఒక్క ఏఎన్నార్ త‌ప్ప‌.. దాదాపు చాలామంది హీరోలు, హీరోయిన్లు, స‌హ‌న‌టులు ఏదోఒక పార్టీ వైపు నిలిచిన‌వారే ఉన్నారు. శార‌ద‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, కృష్ణ‌, జ‌గ్గయ్య‌, డి.రామానాయుడు, కోట శ్రీనివాస‌రావు, బాబూమోహ‌న్‌, వేణుమాద‌వ‌, శ్రీహ‌రి. ఇలా అగ్ర‌తారాగణం టీడీపీ, కాంగ్రెస్ అంటూ రాజ‌కీయం ప్ర‌చారం.. ప‌ద‌వులు అధిరోహించారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బాల‌య్య రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు.

చిరంజీవి కుటుంబం నుంచి రావ‌టంతో పవ‌న్‌పై కూడా ఆ ప్ర‌భావం ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగానో ప‌డుతూనే ఉంటుంది. ప్ర‌స్తుతం తెలుగు సినిమా పెద్ద‌న్న‌గా చిరంజీవి బాధ్య‌త‌లు భుజాన‌కెత్తుకున్నారు. అన్నీ తానై ముందు వ‌రుస‌లో ఉంటున్నారు. వ‌య‌సు రీత్యా కృష్ణ‌, రాఘ‌వేంద్ర‌రావు వంటివారున్నా… చిరంజీవిని ముందు ఉంచారు. క‌రోనా కాలంలో సినీకార్మికుల‌కు తార‌లంద‌రూ త‌మ వంతు తోడ్పాటును ఇచ్చారు. చిరు క‌రోనా క్రైసిస్ అనే ఛారిటీ ట్ర‌స్ట్ ఏర్పాటు చేసి కోట్లు విరాళం సేక‌రించి మ‌రీ కార్మికుల‌కు మూడు నెల‌ల స‌రుకులు పంపిణీ చేశారు. ఆ త‌రువాత లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఎత్తేయ‌టంతో చిరు, నాగార్జున‌, రాజ‌మౌళి, జీవిత‌, కొర‌టాల త‌దిత‌ర సినీతారా, ద‌ర్శ‌క‌గ‌ణం ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌, అటు ఏపీ సీఎం జ‌గ‌న్‌తోనూ మంత‌నాలు సాగించి షూటింగ్‌ల‌కు అనుమ‌తి తెచ్చారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స‌మావేశ‌మైన‌పుడు బాల‌య్య త‌న‌ను పిల‌వ‌లేదంటూ కామెంట్స్ చేశారు.  పైగా ఇదంతా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం డ్రామా అంటూ నోరుజారాడు. దీనిపై నాగ‌బాబు కౌంట‌ర్ ఇవ్వ‌టం.. వైసీపీ నేత పోసాని కూడా జోక్యం చేసుకుని బాల‌య్య బాబు మంచోడు.. ఏదో కోపంలో అన్నాడంటూ స‌ర్దిచెప్ప‌టం అన్నీ జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌ను తెలుగు సినీ పెద్ద‌లు క‌ల‌సి వ‌చ్చారు. విశాఖ‌లో వైఎస్సార్ సీఎంగా ఉన్న‌పుడు స్టూడియోకోసం ఇచ్చిన స్థ‌లం గురించి చ‌ర్చించారు. ఈ లెక్క‌న‌.. బాల‌య్య చేసిన కామెంట్స్‌కు ఇదిగో సాక్ష్య‌మంటూ నంద‌మూరి అభిమానులు వేలెత్తి చూపుతున్నారు. తెలంగాణ‌లో ఉన్న కేసీఆర్ స్వ‌యంగా తాను పెద్ద ఎన్టీఆర్ అభిమానిని అంటాడు.. బాల‌య్య అంటే త‌న‌కు పుత్ర‌వాత్స‌ల్యం ప్ర‌ద‌ర్శిస్తాడు. ఏపీలోనూ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి బాల‌కృష్ణ అంటే చాలా ఇష్టం అంటారు. ఈ లెక్క‌న‌.. ఇద్ద‌రు సీఎంల‌కూ బాల‌య్య ఆప్తుడు . అయినా బాల‌య్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నందున‌.. రాజ‌కీయ ‌కోణంలోనే ప్ర‌తి ఒక్క‌రూ చూస్తున్నార‌నేది పోసాని ముర‌ళీకృష్ణ అభిప్రాయం. బాల‌య్య ష‌ష్ఠి పూర్తి వేడుక‌ల సంద‌ర్భంగా గొడ‌వ‌ల‌న్నీ స‌మ‌సిపోయి.. మ‌ళ్లీ  వీరంతా ఒకేతాటిపైకి వ‌స్తారంటూ సినీపెద్ద‌లు లెక్క‌లు క‌డుతున్నారు. మ‌రి ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నాయో.. ఎవ‌రి తిక్క ఎంత వ‌ర‌కూ తీసుకెళ్తుందో వెండితెర‌పై చూడాల్సిందేనేమో!

You might also like

Leave A Reply

Your email address will not be published.