FbTelugu

నిర్లక్ష్యానికి నిదర్శనం.. బాత్రూంలో రోగి మృతి

నెల్లూరు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది తీరు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. కరోనాతో ప్రభుత్వాస్పత్రిలో చేరిన కరోనా బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

కరోనా బాధితులను పట్టించుకునే నాధుడే లేకపోవడంతో ఓ కరోనా పేషెంట్ బాత్ రూంలోనే మృతి చెందాడు. బాత్ రూం క్లీనింగ్ కు వచ్చిన పారిశుద్ధ్య సిబ్బంది అతన్ని గుర్తించారు. అతడు ఎప్పుడు మృతి చెందాడో కూడా తెలియకపోవడం గమనార్హం. వైద్యుల తీరుపై మృతుని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You might also like